షాపింగ్ మాల్లో వీడియో: 5,000 దిర్హామ్ల జరీమానా
- January 10, 2019
అజ్మన్లో ఓ వ్యక్తి షాపింగ్ మాల్లో వీడియో తీసినందుకుగాను అతనికి 5,000 దిర్హామ్ల జరీమానా విధించారు. అంతే కాకుండా, అతని మొబైల్ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థాంన ఆదేశించింది. అజ్మన్ చైనా మాల్లో, ఇద్దరు ఆసియా జాతీయులైన బాలికలు షాపింగ్ చేస్తుండగా, ఓ వ్యక్తి వారిని ఫోన్లో చిత్రీకరించాడు. అయితే, తాను ఆ అమ్మాయిల్ని షూట్ చేయలేదనీ, మాల్లో అలంకరణను షూట్ చేస్తున్న సమయంలో, వారు అక్కడికి వచ్చారని తన వాదనను నిందితుడు న్యాయస్థానంలో విన్పించారు. ఇతరుల అనుమతి లేకుడా వారి ఫొటోలు లేదా వీడియోలు తీయడం నేరంగా పరిగణిస్తారు. ఇటీవలే ఓ వ్యక్తి, ఓ మహిళ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినందుకుగాను 150,000 జరీమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. దుబాయ్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..