వినయ విధేయ రామ: రివ్యూ

- January 11, 2019 , by Maagulf
వినయ విధేయ రామ: రివ్యూ

బోయపాటి శ్రీను డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా చేసిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఐదుగురు అన్నదమ్ములు ఉన్న అందమైన ఫ్యామిలీలో అనందమ్ముల్లో అందరి కన్నా చిన్నవాడైన రామ్ (చరణ్) అంటే అందరికి ఇష్టం. వైజాగ్ బై ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమీషనర్ గా వర్క్ చేసే చరణ్ పెద్దన్న ప్రశాంత్ పందెం పరశురాం కు వ్యతిరేకంగా ఉంటాడు. అది నచ్చని పరశురాం (వివేక్ ఓబేరాయ్) ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఈసిని చంపేయడంతో పందెం పరశురాంని చంపడమే తన మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంటాడు రామ. మరి పందెం పరశురాంను రామ ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

రంగస్థలం తర్వాత రాం చరణ్ లో కొత్త నటుడిని చూస్తున్నామని చెప్పొచ్చు. వినయ విధేయ రామలో కూడా చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చరణ్ లోని మాస్ ఎలిమెంట్స్ బాగా ఎలివేట్ అయ్యేలా చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. హీరోయిన్ గా కియరా తక్కువ సీన్స్ ఉన్నా పర్వాలేదు అనిపించింది. ఇక ప్రశాంత్ పాత్ర జస్ట్ ఓకే. మిగతా అన్నలు వదినలు పరిధి మేరకు నటించారు. ఆర్యన్ రాజేష్ కు మంచి పాత్ర దొరికింది. ఇక విలన్ గా వివేక్ ఓబేరాయ్ అదరగొట్టాడు. క్రూరమైన విలన్ గా వివేక్ తన నటనతో మెప్పించాడు.

సాంకేతికవర్గం పనితీరు :

రిషి పంజాబి, ఆర్ధర్ విల్సన్ ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ సినిమాకు మంచి అవుట్ పుట్ అందించారు. సినిమాలో చరణ్ ర్యాంబో లుక్ చూపించిన తీరు బాగుంది. కెమెరా వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్దగా మెప్పించలేదు. కేవలం చరణ్ డ్యాన్స్ తో కవర్ చేశాడే తప్ప డిఎస్పి డిజప్పాయింట్ చేశాడు. బిజిఎం ఓకే అనిపించాడు. కథ, కథనాల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ చూపించాడు. కథ కొత్తగా లేకపోవడంతో పాటుగా కథనం వయిలెన్స్ ఎక్కువవడం జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

వినయ విధేయ రామ అనే సాఫ్ట్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తీశాడు బోయపాటి శ్రీను. సినిమా ట్రైలర్ చూస్తేనే సినిమా కథ ఏంటన్నది రివీల్ అవుతుంది. అనుకున్నట్టుగానే ఈసిగా పనిచేస్తున్న అన్నని విలన్ చంపేయడంతో అతన్ని టార్గెట్ చేసిన హీరో విలన్ ను ఎలా మట్టుపెట్టాడో వివి ఆర్ కథ.

బోయపాటి సినిమాల్లో యాక్షన్ పాళ్లు కాస్త ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో చరణ్ చేత విధ్వంసం అంతా ఇంతా కాదు. సినిమాకు అవసరమైన ఎనర్జీ ఇచ్చాడు. మెగా ఫ్యాన్స్ కు ఈ సంక్రాంతికి మెగా ట్రీట్ ఇచ్చాడు బోయపాటి. అయితే కథలో పెద్దా దమ్ము లేకపోవడం.. కాస్త వయిలెన్స్ కూడా ఎక్కువవడం లాంటివి ఆడియెన్స్ కు రుచించవు.

ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది.. ఇంటర్వల్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ కాస్త వైలెంట్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా వివి ఆర్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎలాగు సంక్రాంతి హాలీడేస్ ఉన్నాయి కాబట్టి సినిమా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అవ్వొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఉన్నా సినిమాలో యాక్షన్ పార్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. యూత్ మెగా ఫ్యాన్స్ కు పండుగ లాంటి సినిమా వివి ఆర్.

ప్లస్ పాయింట్స్ :

రాం చరణ్

యాక్షన్ సీన్స్

వివేక్ ఓబేరాయ్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్ :

ల్యాక్ ఆఫ్ స్టోరీ

వైలెన్స్

బాటం లైన్ :

వినయ విధేయ రామ.. బోయపాటి మార్క్ చరణ్ విధ్వంసం..!

మా గల్ఫ్ రేటింగ్ : 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com