ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటో పంపిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
- January 11, 2019
మనం ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటోను పంపించింది చైనాకు చెందిన చాంగె-4 స్పేస్‌క్రాఫ్ట్. చరిత్రలో తొలిసారి జనవరి 3న చంద్రుని అవతలి వైపు మనిషి పంపిన స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండైన విషయం తెలిసిందే. యుటూ 2 అనే రోవర్ ల్యాండర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. గురువారమే అది చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లింది. చాలంగె-4లోని కెమెరా చంద్రుడి పనోరమిక్ ఫొటోను తీసి భూమికి పంపించింది. దీనిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్‌ఎస్‌ఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫొటోలో చంద్రుడితోపాటు ల్యాండర్, రోవర్ కూడా కనిపిస్తున్నాయి. ల్యాండింగ్ సైట్‌లో చంద్రుడి ఉపరితలానికి సంబంధించి సైంటిస్టులు ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ కూడా జరిపినట్లు చైనా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతా తమ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు వివరించింది. ఐదు రోజుల పాటు స్టాండ్ బై మోడ్‌లో ఉన్న 140 కిలోల రోవర్.. గురువారం నుంచే పని మొదలుపెట్టింది. చంద్రుడి గురించి ఇప్పటివరకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి చంద్రుడి చీకటి భాగమే కీలకమని సైంటిస్టులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!