భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది--వెంకయ్యనాయుడు
- January 12, 2019
భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని వెంకయ్యనాయుడు యువతకు దిశానిర్ధేశం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టు దగ్గర జరిగిన స్వామి వివేకానంద ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువత పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని 120 ఏళ్ల కిందటే స్వామి వివేకనంద స్వామి అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు..
స్వర్ణభారత్ ట్రస్ట్ విద్యార్థులతో ముఖాముఖిలో వెంకయ్యనాయుడు కాసేపు మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడి క్యాంటీన్‌ను స్వయంగా పరిశీలించి భోజన వసతిపై ఆరా తీశారు..
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!