అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ రెడీ
- January 14, 2019
దోహ : అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ సన్నద్ధమ వుతోంది. ప్రస్తుతమున్న 30బిలియన్ డాలర్ల ( రూ.21,11,40,00,00,000) పెట్టుబడిని రానున్న రెండేండ్లలో 45బిలియన్ డాలర్లకు ( రూ.31,67,10,00,00,000) చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు ఖతార్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ సీఈవో మన్సూర్ బిన్ ఇబ్రహీమ్ తెలిపారు. ఖతార్ పర్యటలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియోతో భేటీ ఆయన తర్వాత ఇబ్రహీమ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఈయూతో సమానంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థనీ రాజకీయ, రక్షణ సంబంధిత వ్యవహారాలపై పోంపియోతో సుదీర్ఘంగా చర్చించారని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఆయన ఉద్ఘాటించారు. గతనెలలో అమెరికాలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ప్రస్తుతం ఖతార్లో చర్చలు నిర్వహించామని అన్నారు. అమెరికాతో విద్య, రక్షణ,సాంకేతిక పరిజ్ఞానం, శక్తివనరులు, పరస్పర సహకారం, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా