అంబరీష్ లేని లోటుని భర్తీ చేయనున్న సుమలత..
- January 14, 2019
కర్ణాటక రాజకీయాల్లో మరో స్టార్ అరంగేట్రం చేయనున్నారు. అంబరీష్ లేని లోటు తీర్చడానికి.. ఆయన భార్య, ఒకప్పటి టాప్ హీరోయిన్ సుమలత పాలిటిక్స్ లోకి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించకపోయినా జరుగుతున్న పరిణామాలు.. ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. శాండల్ వుడ్ రెబల్ స్టార్ గా అంబరీష్ కు మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆయన సినిమాలు చేసినా, రాజకీయాల్లోకి వచ్చినా జనం జేజేలు కొట్టారు. ఇప్పుడు సుమలతను కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఆదివారం నాడు మాండ్యాలో జరిగిన అంబరీష్ సంస్మరణ సభతో ఈ విషయం స్పష్టమైంది.
అంబరీష్ సంస్మరణ సభకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పార్టీ కార్యకర్తలూ అదే స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభకు వచ్చిన సినిమా హీరో దర్శన్ తో పాటు ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేశ్, సీనియర్ యాక్టర్ దొడ్డణ్ణలు.. సుమలత రాజకీయ అరంగేట్రం అంశాన్ని ప్రస్తావించారు. సభలో ఈ విషయాన్ని ప్రకటించగానే.. అభిమానుల ఆనందం రెట్టింపైంది. సుమలత రాజకీయాల్లోకి రావాల్సిందే అని నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే జేడీఎస్ తరపున పోటీ చేయమంటూ సలహా ఇచ్చారు. అదీ కాకపోతే.. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయండి.. దగ్గరుండి గెలిపించుకుంటాం అంటూ నినాదాలు చేశారు. సుమలతను గెలిపించి తీరుతామని ప్రతిజ్ఞ కూడా చేయడంతో.. రాజకీయాల్లోకి ఆమె రాక దాదాపు ఖాయమైనట్టేనని తేలిపోయింది.
సుమలత కుమారుడు, సినిమా హీరో అభిషేక్ కూడా.. తన తల్లి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమలత కూడా దీనిని వ్యతిరేకించలేదు. అంటే రాజకీయాల్లోకి రావడంపై సుమలతకు కూడా అభ్యంతరం లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో సుమలతకు కూడా టిక్కెట్ కోసం అంబరీష్ చివరి వరకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







