మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
- January 14, 2019
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ట్రావన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీడీబీ అధ్యక్షుడు పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జ్యోతి దర్శనం సందర్భంగా పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. స్వామివారి తిరువాభరణాలను సోమవారం సాయంత్రం 6గంటలకు పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానం చేరుస్తామని అన్నారు. 6.30 గంటలకు దీపారాధన చేసి, స్వామికి దివ్యాభరణాలు ధరింపచేసే తిరువాభరణ ఘట్టం పూర్తి చేస్తామని తెలిపారు. అదే సమయంలో పొన్నంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈనెల 19 వరకు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చని, 20న పందళ రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆలయాన్ని మూసివేస్తామని టీడీబీ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







