నాగచైతన్య, సమంత, శివనిర్వాన మజిలి సినిమా ఎప్రిల్ 5న విడుదల..
- January 14, 2019
పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు రెండో లుక్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసారు చిత్రయూనిట్. నాగచైతన్యతో పాటు ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ ఈ లుక్ లో ఉన్నారు.. అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ లుక్ లో గడ్డంతో కనిపించిన నాగచైతన్య.. ఈ సారి మాత్రం క్లీన్ షేవ్ తో ఉన్నారు. పైగా చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని చాలా స్టైలిష్ గా ఉన్నారు నాగచైతన్య. దివ్యాంశ కౌశిక్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ లుక్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శివనిర్వాన. నిన్నుకోరి తర్వాత శివనిర్వాన తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ మజిలి చిత్రం. 80 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది మజిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు:
అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకుడు: శివ నిర్వాన
నిర్మాతలు: సాహు గరపాటి, హరీష్ పెద్ది
సంస్థ: షైన్ స్క్రీన్స్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫర్: విష్ణు వర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..