టెహ్రాన్ లో కూలిన కార్గో విమానం
- January 14, 2019
టెహ్రాన్: ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో సైన్యానికి చెందిన ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఆ దేశ మీడియా సమాచారం ప్రకారం విమానంలో ఉన్న 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇరాన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రీజా జాఫర్జాదేహ్ అక్కడి మీడియాకు వెల్లడించారు. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్ రాజధాని బిషెక్ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్ విమానం వేరే రన్‌వేపై దించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!