చిరునవ్వుకు ఫిదా అయిన భారత సైనికులు
- January 14, 2019
జైసల్మేర్,(రాజస్థాన్): భారత్ సైనిక రహస్యాలను ఛేదించేందుకు పొరుగుదేశం శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. సైబర్‌దాడులు, వెబ్‌సైట్ల హ్యాకింగ్ ఒక ఎత్తు అయితే అందమైన అమ్మాయిలను ఎరగావేసి సైనికులనుంచే నేరుగా సైనిక రహస్యాలను రాబట్టుకునేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ శతవిధాలాప్రయత్నిస్తున్నది. అడుగడుగునా కట్టడిచేస్తున్నా ఎక్కడో ఒకచోట మన సైనికులు అమ్మాయిల అందమైన మాటలకు పడిపోతున్నారు. ఇదే తరహాలో అనిక్‌చోప్రా తన పేరు అని పరిచయం చేసుకున్న ఒక అందమైనయువతి తన ఫేస్‌బుక్,మెసేంజర్ వినియోగించి ఏకంగా 50 మంది సైనికులను వలలో వేసుకుంది. అనికాచోప్రా పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేసింది. భారత ఆర్మీ కెప్టెన్‌గా పరిచయం చేసుకుని ఆకుపచ్చ చీరెతో అందంగా నవ్వులు చిందిస్తూ ఉన్న ఒకప్రొఫైల్‌ను పోస్టుచేసింది. అంతే ఒక్కసారిగా ఆమెకు మన సైనికులు ఫిదా అయిపోయారు. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది సైనికులు చిక్కుకున్నారు.
సోమ్‌వీర్‌సింగ్‌అనే జవాను అందరికంటే చనువుగా మెలిగాడు. సోమ్‌వీర్‌సింగ్‌కు ఈమె పరిచయం కాకముందే పెళ్లి అయింది. చివరికి వీరిద్దరిబంధం దేశభద్రతకు సంబంధించిన నిగూఢ రహస్యాలను పంచుకునేంతవరకూ వెళ్లింది. ఆమె పాకిస్తాన్ ఏజెంట్ అని తెలుసుకోలేకపోయిన సోమ్‌వీర్ జైసల్వేమర్‌లోని ఆర్మీస్థావరంలో జరిగే కార్యకలాపాలకు సంబంధించినచిత్రాలు అనికచోప్రాతో పంచుకున్నాడు.
చివరికి దేశ భద్రతకు సంబంధించినరహస్యాలుసైతం పాక్ ఏజెంట్‌తో పంచుకున్నందుకు పోమ్‌వీర్‌సింగ్‌ను పోలీసులు అరెస్టుచేసారు. 2016లోనే అనిక సోమ్‌వీర్‌సింగ్‌కు ఫేస్‌బుక్‌ద్వారా పరిచయం ఏర్పడింది. అలామొదలైన వీరిపరిచయం చివరకు సోమ్‌వీర్ భార్యకు విడాకులిచ్చి అనికను వివాహంచేసుకోవాలన్న పరిస్థితికి పిచ్చిలోనికి చేరుకున్నాడు. గత ఐదునెలలుగా పదేపదే ఫోన్‌కాల్స్‌మాట్లాడుతుండటంతో ఆతని ఫోన్‌కాల్స్‌పై మిలిటరీ ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా ఉంచాయి.
తీగలాగితే మొత్తం డొంక కదిలిందన్నట్లు చోప్రా పాకిస్తాన్ ఏజెంట్ అని ఇంటిలిజెన్స్ గుర్తించింది. అనిక తొలుత ఎక్కడినుంచి పోస్ట్‌లు పెడుతున్నావని అడిగేది. మి మలిటరీ ట్యాంక్‌ఫోటోలు పంపించాలని అడిగేదని, అలా అడిగిన సందర్భంలో ఆతను ఫోటోలు పంపినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదిలా ఉంటే అనిక చోప్రా పరిచయం పెంచుకున్న 50 మంది సైనికులనుసైతం విచారించాలని మిలిటరీ నిఘా విభాగం నిర్ణయించింది.
మొత్తం మీద హనీట్రాప్‌తో భారత సమాచారాన్ని మొత్తం సేకరించేందుకు మన సైనికులపై పాక్ అందమైన యువతలను ఎరవేస్తున్నదనిఈ ఉదంతం మరోసారి స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!