జెట్‌ఎయిర్‌వేస్‌ను ఆదుకోనున్న ఎతిహాద్‌ ఎయిర్లైన్స్

- January 14, 2019 , by Maagulf
జెట్‌ఎయిర్‌వేస్‌ను ఆదుకోనున్న ఎతిహాద్‌ ఎయిర్లైన్స్

ముంబై:కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు ఎతిహాద్‌ కీలక చర్యలు చేపట్టింది. జెట్ ఎయిర్‌వేస్‌లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌ తన వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో నరేష్‌ గోయల్‌కు 51శాతం వాటా ఉంది. ఈ డీల్‌ అనంతరం ఆయన వాటా 20శాతం కంటే దిగువకు పడిపోనుంది. దీంతోపాటు ఆయనకు 10శాతం ఓటింగ్‌ హక్కులు లభించనున్నాయి. దీనిపై ఇరువర్గాల నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.

మరోపక్క మార్కెట్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 19శాతం లాభపడ్డాయి. నవంబర్‌ 15 నుంచి ఇప్పటి వరకు ఈ షేర్‌ కౌంటర్‌లో వచ్చిన అతిపెద్ద లాభం ఇదే. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైనర్‌గా పేరొందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గత 11ఏళ్లలో 9 సంవత్సరాలు నష్టాలనే చవిచూసింది. ప్రస్తుతం ఎతిహాద్‌కు మొత్తం 24శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థలో విదేశీ సంస్థలు 49శాతం మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

దీంతో ఎతిహాద్‌ ఆమేరకు వాటాలను కొనుగోలు చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com