ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట పెళ్లి సందడి
- January 14, 2019
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఇంట పెళ్ళి సందడి
- ADVT -
ఈ నెలాఖరులో జనుగనున్న రాజ్ ఠాక్రే కుమారుడి వివాహం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందని ఆహ్వానం
రాహుల్‌గాంధీ, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ లాంటి ప్రముఖులు హాజరు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెలాఖరులో ఆయన కుమారుడి వివాహం జరగనుంది. ఈ శుభాకార్యానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ లాంటి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇంకా వివాహ ఆహ్వానం అందకపోవడం గమనార్హం.ఆ మధ్య ఠాక్రే కూడా ఈ విషయంపై మీడియా ఎదుట ప్రస్తావించారు. కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా అని అప్పట్లో మీడియా రాజ్‌ఠాక్రేను ప్రశ్నించగా.. ‘పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?’ అంటూ బదులిచ్చారు. దీంతో ప్రధాని మోదీని రాజ్‌ఠాక్రే ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!