శబరిమలలో మకరజ్యోతి దర్శనం
- January 14, 2019
కేరళ:శబరిమల వాసుడు అయ్యప్పదేవుడి సన్నిధిలో కీలక ఘట్టం షురూ అయింది. ఇవాళ జ్యోతి దర్శనం కోసం శబరిమల కొండల్లో అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మరికాసేపట్లో ఆవిష్కృతం కానున్న జ్యోతి దర్శనం కోసం భక్తకోటి తపిస్తోంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు దక్షిణాది రాష్ట్రాలనుంచి భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు, సామాన్య భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. (జనవరి14వ తేదీ సొమవారం) సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు జరిగే మకరజ్యోతి దర్శనం కోసం పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది. కాగా, రెండు రోజుల క్రితమే పంధాలం నుండి వచ్చిన అయ్యప్ప స్వామి తిరువాభరణాలను సాయంత్రం 6గంటలకు 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. అనంతరం తిరువాభరణం ఘట్టం జరుగుతుంది. తిరువాభరణం ఘట్టాన్ని, జ్యోతి దర్శనాన్ని చూసేందుకు నలుమూలలనుంచి సుమారు 18 మంది లక్షల మంది శబరిమలవాసుని సన్నిధికి చేరుకున్నారని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







