వేధింపుల్ని తట్టుకోలేక కొలీగ్ హత్య
- January 16, 2019అరబ్ వ్యక్తి ఒకరు, సహచరుడి వేధింపుల్ని తట్టుకోలేక అతన్ని హత్యచేశాడు. రాత్రి 9 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటర్నేషనల్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెళ్ళేసరికి రక్తపుమడుగులో బాధితుడు పడివున్నాడు. బాధితుడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించి, అనుమానితుడ్ని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. కాగా, తనను వేధింపులకు గురిచేయడంతోనే తాను ఈ దాడికి పాల్పడాల్సి వచ్చిందని నిందితుడు చెప్పారు. గొడవ తీవ్రమై, కత్తితో తాను ఆ వ్యక్తిని పలుమార్లు పొడిచినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు