పుట్టినరోజు సందర్భంగా విజయ్ సేతుపతి లుక్ విడుదల చేసిన 'సైరా'
- January 16, 2019
మెగాస్టార్ చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహ రెడ్డి'. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బి అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు , సుదీప్ , విజయ్ సేతుపతి వంటి స్టార్ నటి నటులు ఈ చిత్రం లో నటిస్తున్నారు. ఇప్పటికే 75 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి విజయ్ సేతుపతి లుక్ వచ్చేసింది.
చిత్రంలో నటిస్తున్న నటి నటుల పుట్టిన రోజునాడు వారి ఫస్ట్ లుక్ లను విడుదల చేస్తూ వారికీ బెస్ట్ విషెష్ ను అందిస్తూ వస్తున్నారు. బిగ్ బి , నయనతార పుట్టిన రోజు నాడు వారి లుక్ లు విడుదల చేయగా , ఈరోజు విజయ్ సేతుపతి పుట్టిన రోజు కావడం తో సైరా లో విజయ్ తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.
ఇందులో విజయ్ రాజా పాండి అనే పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. వీరుడిలా కనిపిస్తున్న విజయ్ సేతుపతి లుక్ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ మ్యూజిక్ అందిస్తుండగా , ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!