తేజు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
- January 16, 2019
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ .. రితిక సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కథానాయికలలో ఒకరి పేరు 'చిత్ర' .. మరొకరి పేరు 'లహరి' అయ్యుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ టైటిల్లోని అయిదు అక్షరాలలో, ఒక్కో అక్షరంతో మొదలయ్యే ఒక్కో పేరుతో అయిదు ముఖ్యమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!