భారతీయులకు ఎఫెక్ట్ ఇవ్వనున్న హెచ్1బీ మార్పులు..
- January 16, 2019
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాలో మార్పులు చేయడం వల్ల భారతీయులను ఎంపిక చేసుకునే ఐటీ కంపెనీలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్రా రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యంత నైపుణ్యం, అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చేలాగా హెచ్1బీలో మార్పులు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. దీని కారణంగా హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు లభించే వాటిలో 10 శాతం తగ్గే అవకాశం ఉంది. వాళ్లకు బదులుగా అడ్వాన్స్డ్ డిగ్రీ మాస్టర్స్ లేదా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికి ముందస్తు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఐక్రా అభిప్రాయపడింది.
ఈ మార్పులు అమెరికాలోని ఐటీ కంపెనీలపై పడే అవకాశం ఉంది. దీని వల్ల హెచ్ 1బీ వీసాలపై ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు నష్టం వాటిల్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధానం భారత్ ఐటీ కంపెనీలకు వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఏటా 65వేల హెచ్ 1బీ వీసాలు జారీ చేయాలి. దీంతో పాటు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి 20వేల వీసాలు ఇవ్వాలి. తాజాగా ప్రతిపాదించే నిబంధనల ప్రకారం యూఎస్‌లో చదువుకుని, అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం కలుగుతుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







