'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!
- January 17, 2019
నితిన్ కథానాయకుడిగా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల వినిపించిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!