గాంధీ శాంతి బహుమతి విజేతలు
- January 17, 2019
2015 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలానికి గాంధీ శాంతి బహుమతుల విజేతల పేర్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2018 సంవత్సరానికి ఈ అవార్డును యోహీ ససకావా గెలుచుకున్నారు.ఈయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ప్రపంచవ్యాప్తంగా కుష్టు నివారణకు కృషి చేస్తున్నారు. 2015 సంవత్సరానికి వివేకానంద కేంద్ర ఈ అవార్డును గెలుచుకుంది. 2016కు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నాయి. 2017 ఏడాదికి ఏకై అభియాన్ ట్రస్ట్‌ను, 2018కి కుష్టు వ్యాధి నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో సౌహార్ద్ర రాయబారిగా ఉన్న యోహీ ససకవాకు అవార్డులను ప్రకటించారు.
చివరిగా 2014లో ఈ పురస్కారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రదానం చేశారు. 2015 నుంచి ఎవరికీ ఇవ్వలేదు. ఈ బహుమతి కింద రూ.కోటితోపాటు ప్రశంసాపత్రం ఇస్తారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది. ఈ జ్యూరీలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎల్‌కే అద్వానీ సభ్యులు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







