రాగి పాత్రలోని నీళ్ళ త్రాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
- December 25, 2015
సాధారణంగా మనం నీటిని గ్లాసు లేదా పోర్సిలిన్ లేదా స్టీల్ కప్పుతో రెగ్యులర్ నీరు తాగుతుంటాము. మరి కాపర్ కప్పుతో నీరు త్రాగవచ్చని, కాపర్ కప్పుతో నీరు త్రాగుతారని మీకు తెలుసా?కాపర్ కప్పుతో రెగ్యులర్ గా నీటిని త్రాగడం అలవాటు చేసుకోండి . కాపర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాపర్ కప్పు చూడటానికి క్లాసిగా, అందంగా, ట్రెండిషినల్ గానే కాదు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అన్ని రకాల ప్రయోజనాలను పొందాలంటే కాపర్ కప్పులో నీరు నింపి రాత్రంతా నిల్వచేయాలి. కనీసం 4గంటలైనా నీరు కాపర్ కప్పులో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో కాపర్ కప్పులోని కాపర్ తో పాటు ఇతర పదార్థాలను కూడా నీరు గ్రహిస్తుంది. ఆ నీటిని త్రాగడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. కాపర్ శరీరానికి ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. . కాపర్లో ఉండే ప్రతి ఒక్క అంశం నీటిలో కలుస్తుంది. . దాంతో నీరు యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. మన పూర్వీకులు రాగి పాత్రలనే ఎందుకు వాడేవాళ్లు ? అంతే కాదు కాపర్ కప్పులోని నీరులో ఏవైనా హానికరమైన బ్యాక్టీరియా ఉన్నా, దాన్ని తొలగిస్తుందన్న విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది . అలాంటి ఫలితాలని పొందాలంటే నీటిని కనీసం 16గంటల పాటు రాగి చెంబులో ఉంచాలి. ఇంకా బరువుతగ్గించడం, గాయాలను మాన్పడం, వ్యాధినిరోధకతను పెంచడం, బ్లడ్ పెజర్ లెవల్స్ ను పెంచడం, రక్తహీనత లోపాన్ని నిరోధించడం , స్కిన్ క్లెన్సింగ్, జాయింట్ పెయిన్ నివారించడం వంటి మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అదే విధంగా కాపర్ వాటర్ త్రాగడం వల్ల మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . మరి అవేంటో తెలుసుకోవాలంటే, ఈ క్రింది లిస్ట్ చూడాల్సిందే.కాపర్ కప్పులోని నీరు ఉదయాన్నే కాలీపొట్టతో తాగినట్లైతే ఇది ఎఫెక్టివ్ గా డైజెస్టివ్ ట్రాక్ ను మెరుగుపరుస్తుంది . అలాగే జీర్ణవాహికలో పెరిస్టాల్టిక్ మోమెంట్ ను మెరుగుపరుస్తుంది . బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. కాపర్ లో ఫాస్పోలిపిడ్స్ కలిగి ఉండటం వల్ల ఇది బ్రెయిన్ డెవలప్ మెంట్ మరియు బ్రెయిన్ ప్రొటక్షన్ కు సహాయపడుతుంది . బ్రెయిన్ లోనాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది . ఇది బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతుంది . కాపర్ కప్పులోని నీరు త్రాగడం వల్ల మెదడు చురుకుగా మరియు క్లియర్ గా పనిచేస్తుంది. కాపర్ కప్పులోని నీరు త్రాగడం వల్ల బాడీ సిస్టమ్ ను శుభ్రం చేస్తుంది మరియు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి మరియు అల్సర్ నివారికు సహాయపడుతుంది . అల్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను డైజెస్టివ్ ట్రాక్ నుండి తొలగిస్తుంది. రోజులో మనం తీసుకొనే ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మీరు జీర్ణక్రియతో పోరాడుతున్నా , స్టొమక్ అప్ సెట్ అయినా కాపర్ కప్పులోని వాటర్ ను ఖచ్చితంగా త్రాగాల్సిందే. మెడిసిన్ అవసరం లేకుండా జీర్ణ సమస్యలను నివారించుకోదగ్గ బెస్ట్ హోం రెమెడీ. కాపర్ కప్పులోని నీటిలో ఉండే యాంటీయాక్సిడెంట్స్ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గాసహాయపడుతుంది. చాలా అరుదగా జబ్బుపడతారు మరియు కాపర్ కప్పులోని వాటర్ త్రాగడం వల్ల బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవడం వల్ల మరింత స్ట్రాంగ్ గా ఉంటారు . కాపర్ వాటర్ త్రాగడం వల్ల ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం. గాయాలున్నప్పుడు, వాటి నుండి తేరుకోవాలంటే కాపర్ కప్పులోని వాటర్ త్రాగాల్సిందే . ఇది సెల్స్ ను ప్రోత్సహిస్తుంది . దాంతో ఎండోతిలియల్ పెరుగుతుంది , దాంతో గాయాలు మానకొస్తాయి . కణజాలాల మర్మమత్తుకు కాపర్ వాటర్ ను తప్పనిసరిగా త్రాగాలి . మరియు చర్మం మీద మచ్చలను తొలగిస్తుంది.. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది . దాంతో హైపోథైరాయిడిజంకు చాలా ఉపయోగకరం. మరియు ఇది బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది, కాబట్టి,థైరాయిడ్ సమస్యలున్నవారు ప్రతి రోజూ ఉదయం ఖచ్చితంగా కాపర్ కప్పులోని వాటర్ త్రాగడం మంచిది శరీరంలో ఎంజైమ్స్ ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది మరియు శరీరంలో అడినోసిన్ ట్రైఫాస్పేట్ ను ఉత్పత్తి అయ్యేలా చేసి శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని శరీరమంతా ప్రసరించేలా చేస్తుంది . దాంతో మీరు లేజిగా లేదా బద్దకంగా లేకుండా చేస్తుంది. కాపర్ కప్పులోని నీరు త్రాగడం వల్ల ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి. కాపర్ కప్పులోని వాటర్ త్రాగడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. కాపర్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది . శరీరం నుండి వాటిని తొలగిస్తుంది. లేదంటే ఈ ఫ్రీరాడికల్స్ క్యాన్సర్ సెల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా కణాలను, కణజాల యొక్క డ్యామేజ్ కు కారణం అవుతాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









