ఇండియాకి ప్రమోషనల్ రేట్స్ ప్రకటించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- January 18, 2019
బహ్రెయిన్ నుంచి కోజికోడ్, కోచి, తిరువనంతపురం మరియు మంగళూరుకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'ఆల్ ఇంక్లూజివ్' ప్రమోషనల్ ఫేర్స్‌ని ప్రకటించింది. జనవరి 17 నుంచి 23 మధ్య టిక్కెట్లను బుక్ చేసుకుని జనవరి 17 నుంచి మార్చి 30 లోపు ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బహ్రెయిన్ నుంచి కోచి ప్రయాణానికి 47 బహ్రెయినీ దినార్స్ నుంచి ధరలు మొదలవుతాయి. బహ్రెయిన్ నుంచి కోజికోడ్‌కి టిక్కెట్ ధరలు 52 బహ్రెయినీ దినార్స్, బహ్రెయిన్ నుంచి మంగళూరుకి 62 బహ్రెయినీ దినార్స్ నుంచి టిక్కెట్ ధరలు వుంటాయి. వీటితోపాటుగా 30 కిలోలల ఉచిత బ్యాగేజీ అలవెన్స్‌ని కూడా అందించనుంది. ప్రయాణీకులకు 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీని అందిస్తారు. 5 కిలోల అదనపు బ్యాగేజీని 8 బహ్రెయినీ దినార్స్ చెల్లించి తీసుకెళ్ళొచ్చు. 25 బోయింగ్ 737-800 ఎన్జి విమానాల్ని కలిగి వున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 13 అంతర్జాతీయ 20 డొమెస్టిక్ డెస్టినేషన్స్‌ని కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







