హీరో సుమన్ కు శోభన్ బాబు పురస్కారం

- January 19, 2019 , by Maagulf
హీరో సుమన్ కు శోభన్ బాబు పురస్కారం

అలనాటి అందాల నటుడు శోభన్‌ బాబు పురస్కారాన్ని నటుడు సుమన్‌ అందుకోనున్నారు. శోభన్‌ బాబు 83వ జయంతి ఉత్సవాలను తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి ఈ నెల 20న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుమన్‌కు రజత కిరీటాన్ని అలంకరించున్నారు. నటి గీతాంజలికి శోభన్‌ బాబు ఆత్మీయ పురస్కారం అందిస్తారు. నటి జయసుధ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, దర్శకుడు రేలంగి నరసింహారావు, నటి కవిత తదితరులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఎవరీ చక్కనివాడు పేరుతో శోభన్‌బాబు సంగీత విభావరి జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com