'కాంచన 3' రిలీజ్ డేట్
- January 19, 2019
వరుసగా హారర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా 'ముని' సిరీస్లో 'కాంచన 3' రెడీ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్లుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఏప్రిల్ 18న సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపారు. ముని సిరీస్లో గతంలో వచ్చిన సినిమాలన్ని ఘనవిజయం సాధించటంతో కాంచన 3పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







