ఔరా! ఆ పాత్రలో రమ్యకృష్ణ నా?

- January 19, 2019 , by Maagulf
ఔరా! ఆ పాత్రలో రమ్యకృష్ణ నా?

ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు విలక్షణమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేస్తూ టాప్ స్టార్ క్రేజ్ లో ఉంది..బాహుబలి మూవీలో శివగామి పాత్రలో ఆమె నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. తాజాగా ఆమె తమిళ మూవీ సూపర్ డీలక్స్ లో నటిస్తున్నది.. విజయ్ సేతుపతి, సమంత, ఫహాద్ ఫాసిల్, మిస్కిన్ లు కీలకపాత్రలలో కనిపించనున్నారు.. ఈ మూవీకి త్యాగరాజన్ కుమారరాజా దర్శకుడు.. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు వెల్లడిస్తూ, రమ్య కృష్ణ ఈ మూవీ పోర్న్ స్టార్ గా కనిపించదని తెలిపాడు.. 49 ఏళ్ల వయసులో ఈ పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందని ఆమె ప్రశంసించాడు.. ముందుగా ఈ పాత్ర కోసం నదియాను సంప్రదించామని, ఈ వయసులో అటువంటి పాత్ర చేయలేనని చెప్పడంతో రమ్యకృష్ణకు కథ వినిపించామని తెలిపాడు.. కథ విన్న వెంటనే మరో మాట లేకుండా ఈ పాత్రలో నటించేందుకు రమ్య అంగీకరించారని చెప్పాడీ దర్శకుడు.. రమ్యకృష్ణ కెరీర్ లో ఈ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com