స్కూల్ బస్ స్టాప్ సైన్‌ని ఉల్లంఘిస్తే 1000 దిర్హామ్‌ల జరీమానా
- January 19, 2019
స్కూల్ బస్‌లు ఆగిన వెంటనే పిల్లలు దిగేందుకు వీలుగా స్టాప్ సైన్స్ తెరచుకుంటాయి. వాటిని చూసి వెనుకాల వున్న వాహనాలు తప్పనిసరిగా ఆగాల్సి వుంటుంది. స్కూలు పిల్లల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొందరు తమ వాహనాల్ని దూకుడుగా ముందుకు నడిపిస్తుంటారు. అలాంటివారికి 1009 దిర్హామ్‌ల జరీమానా తప్పదని అబుదాబీ ట్రాఫిక్ అథారిటీస్ వాహనదారుల్ని హెచ్చరించించడం జరిగింది. బస్ నుంచి ఐదు మీటర్ల కంటే తక్కువ దూరంలో ఆపే వాహనాలకూ ఈ జరీమానా తప్పదు. అలాగే 10 బ్లాక్ పాయింట్స్ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది ఉల్లంఘించినేవారికి. వన్ వే స్ట్రీట్‌పై రెండు వైపులా వాహనాలు స్కూల్ బస్ స్టాప్ సైన్‌ని చూసి ఆగాల్సి వుంటుంది. అదే రెండు మార్గాలున్న రహదారి అయితే స్కూల్ బస్ నిలిపివేసిన వైపు మాత్రమే వాహనాలు ఆగాలి. విద్యార్థుల్ని కిందికి దించే సమయంలో స్కూల్ బస్ డ్రైవర్ స్టాప్ సైన్ ఆర్మ్స్‌ని దించకపోతే 500 దిర్హామ్‌ల జరీమానా, ఆరు బ్లాక్ పాయింట్స్ విధిస్తారని చట్టం చెబుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







