మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం..66 మంది సజీవ దహనం

- January 20, 2019 , by Maagulf
మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం..66 మంది సజీవ దహనం

మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రో పైప్‌లైన్‌ పేలడంతో 66 మంది సజీవ దహనమయ్యారు. మరో 76 మందికిపైగా జనం తీవ్రంగా గాయపడ్డారు. పైప్‌లైన్ లీకవడంతో ఇంధనాన్ని తెచ్చుకునేందుకు స్థానికులు పోటీపడుతున్న సమయంలో పేలుడు సంభవించింది. దీంతో చాలామంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మెక్సికో సిటీలోని త్లాహులిల్‌పాన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కొందరు దొంగలు పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఇంధనాన్ని తెచ్చుకునేందుకు పోటీ పడ్డారు. అదే సమయంలో పైప్‌లైన్‌ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది సజీవదహనమయ్యారు. 76 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హిడాల్గో స్టేట్‌ గవర్నర్‌ ఒమర్‌ ఫయద్‌ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com