రెండోసారి భేటీ కానున్న ట్రంప్-కిమ్

- January 20, 2019 , by Maagulf
రెండోసారి భేటీ కానున్న ట్రంప్-కిమ్

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఫిబ్రవరి చివరిలో రెండోసారి సమావేశం కానున్నారని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సారా సాండెర్స్‌ తెలిపారు. దాదాపు గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో అణునిరాధీయుకరణఫై చర్చిస్తారని, ఈ సమావేశ వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. . ట్రంప్‌తో ఉత్తరకొరియా అధికార పార్టీ కొరియన్‌ వర్కర్స్‌ పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కిమ్‌ యంగ్‌ చోల్‌ సామవేశం ముగిసిన వెంటనే వైట్‌హౌస్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. వాషింగ్టన్‌లోని డల్లాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం రాత్రి చేరుకున్న చోల్‌ శుక్రవారం ఉదయం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంప్‌పియోతో సమావేశమయ్యారు. కాగా, గత ఏడాది జూన్‌లో సింగ్‌పూర్‌లో ట్రంప్‌-కిమ్‌ తొలిసారిగా సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కిమ్‌ ఇటీవల చైనాలో పర్యటించిన సందర్భంలోనూ అమెరికా అధ్యక్షుడితో సమావేశం గురించి పేర్కొన్నారు. ఈ నెల 2న ట్రంప్‌ మాట్లాడుతూ కిమ్‌తో సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com