'గోల్డెన్ రీల్ అవార్డు'కు నామినేట్ అయిన 2.ఓ
- January 20, 2019
చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'రోబో 2.ఓ' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రం మరో అరుదైన ఘనత కూడా సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్రాల్లో 'బెస్ట్ సౌండ్ ఎడిటింగ్'కి గానూ విదేశీ విభాగంలో 2.ఓ నామినేట్ అయినట్లు ఈ సినిమా సౌండ్ డిజైనర్ రసూల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
'గోల్డెన్ రీల్ అవార్డుకు 'రోబో 2.0 ఎంపికయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సౌండ్ డిజైనింగ్ విభాగంలో ఈ చిత్రానికి ఈ ఘనత దక్కింది. భారతీయ సినిమా మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. శంకర్, రజినీ, ఏఆర్ రెహమాన్‌లకు ధన్యవాదాలు, అభినందనలు' అని రసూల్ ట్వీట్ చేశారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ప్రఖ్యాత మోషన్ పిక్చర్ సౌండ్ ఎడిటర్స్(ఎంపీఎస్‌ఈ)66వ వార్షిక గోల్డెన్ రీల్ అవార్డులు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా ఫిబ్రవరి 17న ఈ వేడుకలు జరుగుతాయి. 2.ఓ తో పాటు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సౌండ్ ఎడిటింగ్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.
రజినీ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'రోబో 2.ఓ' చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. అక్షయ్‌కుమార్ ప్రతినాయక పాత్రలో కనిపించారు. అమీ జాక్సన్ కథానాయిక. ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం రూ.700కోట్లు రాబట్టిందని అంచనా.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







