అఖిల్‌కి బెస్ట్ ఫ్యూచర్.. నో డౌట్ - ఎన్ఠీఆర్
- January 20, 2019యువహీరో అఖిల్ కి మంచి భవిష్యత్తు ఉందని, ఏదో ఒక రోజు టాలీవుడ్ లో మంచి నటుడిగా నిలిచిపోతాడని అన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదెంతో దూరంలో లేదని జోస్యం చెప్పాడు. అఖిల్ నటించిన ' మిస్టర్ మజ్ను ' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. దర్శకుడు వెంకీ అట్లూరిని, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు.
కాగా- తారక్ దగ్గర్నుంచి అఖిల్ నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నాడు నాగార్జున. వెంకీ తీసిన ' తొలిప్రేమ ' చిత్రం చూశానని, ఆ చిత్రంతో బాటు ' మజ్ను ' ఎంతో హిట్ అయిందన్నాడు.. ఈ ఫంక్షన్ లో ఇంకా నాగచైతన్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు. ' మిస్టర్ మజ్నులో అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ మూవీ ఈ నెల 25 న విడుదల కానుంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు