దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

- January 21, 2019 , by Maagulf
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌:దొంగతనాలకు పాల్పడటం, ఇళ్ళలోకి చొచ్చుకు వెళ్ళేందుకు గోడల్ని పగలగొట్టడం వంటి నేరాలకు పాల్పడినందుకుగాను ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. వీరు మూడు ఇళ్ళను దొంగతనాల కోసం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. విలాయత్‌ ఆఫ్‌ జలన్‌ బాని బు అలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన వస్తువుల్ని విక్రయించేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వివరించారు. జలన్‌ బాని బు అలి పోలీస్‌ స్టేషన్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - సౌత్‌ షర్కియా పోలీస్‌ కమాండ్‌ నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com