ఘోర రోడ్డు ప్రమాదం: 26 మంది అగ్నికి ఆహుతి
- January 22, 2019
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 26 మంది సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లస్బెలా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి పంజ్‌గుర్ వెళ్తున్న ఓ బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు కిటికీల నుంచి దూకేందుకు యత్నించారు. అయితే అప్పటికే రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో వారంతా మంటల్లో చిక్కుకుపోయారు.
ప్రమాదంలో 26 మంది సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో గుర్తుపట్టని రీతిలో వారి శరీరాలు కాలిపోయాయని తెలిపారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







