ఈజిప్టు సైన్యం కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతం
- January 23, 2019
కైరో: ఈజిప్టులోని సినారు ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య రెండు రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయి. ఈజిప్టు సైన్యం జరిపిన కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతమయ్యారు. 142 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. అలాగే, ఉగ్రవాదుల చేతుల్లో ఏడుగురు సైనికులు మృతిచెందారని ఈజిప్టు సైన్యం మంగళవారం ప్రకటించింది. ఈజిప్టు సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్టు తెలిపింది. అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకు ప్రయత్నిస్తు న్నామని, అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుం టున్నామని సైనికాధికారులు తెలిపారు. వలసదారుల రూపంలో దేశంలోకి ప్రవేశిం చేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని అన్నారు. వీరి దాడులను తిప్పిగొట్టేందుకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. కాగా, ఈజిప్టులో 2017లో ఓ మసీదుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 300 మంది మృతిచెందారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భద్రతాబలగాలు అప్రమ్త మయ్యాయి. సరిహద్దులో భద్రతను పటిష్టం చేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







