ఆఖరికి సెల్ఫీ క్వీన్ శకం అలా ముగిసింది
- January 23, 2019
సోషల్ మీడియా సెల్ఫీ క్వీన్‌గా పేరుగాంచి తైవాన్ దేశానికి చెందిన గిగి వూ చివరకు సెల్ఫీ తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయింది. ఈనెల 19వ తేదీన జరిగిన ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, తైవాన్ దేశంలోని న్యూ తైపీ నగరానికి చెందిన గిగి వూ అనే యువతికి ఎత్తైన ప్రదేశాల నుంచి సెల్ఫీలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమంటే మహా సరదా.
అలా... తైవాన్‌లోని యుషాన్ నేషనల్ పార్కులోని ఎత్తైన పర్వతంపై అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తుజారి వంద అడుగుల లోతులో పడిపోయింది. దీంతో ఆమె కదల్లేని స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. అయితే తాను ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని మాత్రం శాటిలైట్ ఫోన్ ద్వారా తన స్నేహితులకు గిగి వూ చేరవేసింది.
ఆ వెంటనే రంగంలోకి దిగిన తైవాన్ రెస్క్యూ బృందాలు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, వాతావరణం సరిగా లేకపోవడంతో హెలికాఫ్టర్లు ఆ ప్రాంతానికి చేరుకోలేక పోయాయి. ఫలితంగా సెల్ఫీ క్వీన్ ప్రాణాలు విడిచింది. వాతావరణం అనుకూలించిన తర్వాత మృతదేహం కోసం గాలిస్తామని రెస్క్యూ బృందాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







