ప్రవాసీ భారతీయ సన్మాన్ అవార్డ్ లిస్ట్‌లో బహ్రెయిన్ రెసిడెంట్
- January 23, 2019
బహ్రెయిన్‌లోని అల్ హిలాల్ హాస్పిటల్ వైస్ ఛెయిర్మెన్, ప్రముఖ వ్యాపారవేత్త విటి వినోద్, ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇండియన్ అమెరికన్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ కూడా లిస్ట్‌లో వున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ ఎఫైర్స్ - ప్రవాసీ భారతీయ దివస్ నేపథ్యంలో ఈ అవార్డుల్ని ప్రకటించింది. ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్, వారణాసిలో ఈ పురస్కారాల ప్రదానం జరిగింది. విటి వినోద్, బదర్ అల్ సమా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ - ఒమన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రంగంలో వినోద్ చేసిన గణనీయమైన కృషికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం ఆయన్ని వరించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ పురస్కారాల్ని విజేతలకు అందించడం జరిగింది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగునాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..