యూఏఈ మోటరిస్టులకు సూచన: పాక్షిక రోడ్ క్లోజర్
- January 23, 2019
దుబాయ్‌లోని అల్ యలవెస్ రోడ్డు, వాటర్ లాగింగ్ కారణంగా సోమవారం మూసివేయబడింది. అయితే మంగళవారం పాక్షికంగా ఈ రోడ్డుని తెరిచారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. బుధవారం ఉదయం ట్రాఫిక్ నెమ్మదిగా నడిచిందనీ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిదని అధికారులు పేర్కొంటున్నారు. ఎమిరేట్స్ రోడ్, షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్ లేదా ఎక్స్పో రోడ్ని వినియోగించాలని అధికారులు సూచించారు. అబుదాబీలో జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్ - అల్ మర్యా ఐలాండ్ నుంచి అల్ జహియాపై రోడ్ క్లోజర్ వుంటుంది. ఫిబ్రవరి 6 వరకు ఈ రోడ్ క్లోజర్‌ని అమలు చేస్తున్నారు. మిర్బాద్ ఈవెంట్‌కి మద్దతుగా ఈ క్లోజర్ చేపట్టారు. షార్జాలో అరేబియన్ స్ట్రీట్‌ని పాక్షికంగా జనవరి 25 నుంచి జనవరి 27 వరకు మూసివేస్తున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్