'ఎఫ్ 3' లో మాస్ మహారాజా
- January 23, 2019
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ 'ఎఫ్ 2'. వీరికి జంటగా తమన్నా, మెహరీన్ ఆడిపాడారు. సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఐతే, ఈ సినిమా సీక్వెల్ ఎఫ్ 3ని కూడా తీసుకు వస్తానని దర్శకుడు అనిల్ ఇప్పటికే ప్రకటించేశారు. ఐతే, సీక్వెల్ లో వెంకీ, వరుణ్ లకి తోడుగా మరో యంగ్ హీరో కనిపించబోటున్నట్టు తెలుస్తోంది.
ఆ మూడో హీరో నాచురల్ స్టార్ నాని అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తనదైన నటనతో కామెడీని చేయగలిగే నేచురల్ స్టార్ నాని అయితే ఎఫ్ 3 అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని నిర్మాత దిల్ రాజు భావించారట. తాజాగా, నాని స్థానంలో రవితేజ పేరు తెరపైకి వచ్చింది. రాజా ది గ్రేట్ లో రవితేజ కనిపించిన అంధుడి పాత్ర తరహా ఎఫ్ 3లోనూ రవితేజ అంధుడు పాత్రలో కనిపించబోతున్నట్టు లెటెస్ట్ సమాచారమ్. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 ని వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!