ఫ్యాంటు లేకుండా మెట్రోలో ప్రయాణం.. ఒకరూ ఇద్దరూ కాదు..
- January 23, 2019
ఇంట్లో పిల్లాడు చెడ్డీ లేకుండా తిరుగుతుంటే.. ఓరే వెధవా.. నిక్కరు ఎక్కడ పడేశావురా.. మళ్లీ అందులో కూడా సుస్సూ పోశావే ఏంటి. బామ్మ చివాట్లు పెడుతుంటే అందకుండా పరిగెడుతుంటాడు మూడేళ్లున్న బుడతడు. వాడికి చెడ్డీ లేకపోతేనే బామ్మ చూడలేకపోయింది.
ఇక్కడ ఎవరికీ ఫ్యాంట్లు లేవు. ఇదేం పోయేకాలమే తల్లీ అంటే.. ఫ్యాంట్లు, స్కర్టులు లేకుండా మెట్రో ఎక్కమంటూ ఓ సంస్థ పిలుపునందుకుని మేం ఈ పని చేస్తున్నాం. ఇందులో మా తప్పేం లేదు అని సిగ్గు విడిచి మరీ చెబుతున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. వందల మంది ప్రయాణీకులు ఇలా ఫ్యాంటు లేకుడా ప్రయాణిస్తుంటే తోటి ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు.
‘నో ట్రౌజర్’ ఈవెంట్లో భాగంగా లండన్, బెర్లిన్ తదితర నగరాల్లోని ప్రజలు ఇలా ఫ్యాంట్లు విప్పి తిరగడం ఆనవాయితీగా మారింది. ఈ పచ్చి కార్యక్రమం.. అమెరికాలోని న్యూయార్కలో 2002లో ‘నో ఫ్యాండ్ సబ్వే రైడ్’ పేరుతో మొదలైంది.
అండర్ గ్రౌండ్ మెట్రో (సబ్వే ట్రైన్స్ లేదా ట్యూబ్ రైడ్) లలో ప్రయాణించేవారు ఒక రోజంతా ఫ్యాంట్లు ధరించకూడదు. మరి ఇలాంటి మంచి (!!) విషయాలు త్వరగా పాకేస్తాయి కదా అందుకే 60 నగరాలను తాకింది.
లండన్‌లో ఫ్యాంట్లు విప్పి ప్రయాణించేవారంతా ట్రాఫాల్ గర్ స్క్వేర్‌లోని నేషనల్ గ్యాలరీ వద్దకు చేరుకుంటారు. ఫోటోలు, వీడియోలకు ఫోజులిస్తూ కాసేపు సందడి చేస్తారు. అక్కడి నుంచి అంతా వి చాందోస్ పబ్‌కు చేరుకుంటారు. ఈ ఈవెంట్‌ని ‘స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ’ నిర్వహించింది. తాము నిర్వహించిన ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. ప్రజలంతా ఒక రోజు ఫన్నీగా గడుపుతారన్న ఉద్దేశంతో నిర్వహించాము తప్పించి మరే ఉద్దేశమూ లేదు అని సర్థి చెప్పుకున్నారు.
సాధారణ రోజుల్లో అలా ఫ్యాంటు విప్పి రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉండదు. ఒక వేళ వచ్చినా అందరి కళ్లే మనల్నే గమనిస్తుంటాయని ఫీలవుతుంటాము. అయితే ఒక రోజు ఇలా ఫ్యాంట్ లేకుండా ప్రయాణించడాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు ప్రయాణీకులు. అమెరికాలోని కొంతమంది నిర్వాహకులు దీన్ని ఫేస్బుక్ ద్వారా పాపులర్ చేశారు.
అండర్ గ్రౌండ్ మెట్రో రైల్లో ప్రయాణించేవారు మెట్రో డోర్ మూతపడగానే తమ ఫ్యాంట్లు విప్పేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే తమకు రైలు చాలా అసౌకర్యంగా ఉందని చెప్పాలంటూ టాస్క్‌లు ఇస్తారు. ఆమెరికాలో ఏటా మే 3న, బ్రిటన్‌లో జనవరి 13న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇక ఆ రోజు నగర వీధుల్లో ఎంత ట్రాఫిక్ జామయ్యుంటుందో ఊహించుకుంటే..
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!