బషీర్ బాగ్ లో భారీ అగ్నిప్రమాదం
- January 23, 2019
, by Maagulf
- బషీర్ బాగ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది
- ఐదవ అంతస్తులో అడ్వాన్టేజ్ వన్ అనే కార్యాలయంలో చెలరేగిన మంటలు ఫ్లోర్ మొత్తానికి వ్యాపించాయి.
- భయాందోళనకు గురైన ఉద్యోగులు రోడ్ పైకి పరుగులు తీశారు.
- సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.
- ఏసీ ఏసీలో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు అంచనా వేస్తున్నారు.
- ఏసి షార్ట్ సర్క్యూట్, సర్వర్ రూమ్ గుండా మంటలు వ్యాపించడంతో ప్రమాద స్థాయి మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
- ఇప్పటికే ఐదు ఫైరింజన్లతో క్రేన్ ఫైర్ ఇంజన్ తో సహా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
- అయితే మొత్తం ఎనిమిది అంతస్తుల భవనం లో ఐదో అంతస్తు లో ప్రమాదం జరిగింది.
- మొదట అంతస్తులో ఉన్న దాదాపు 300 మంది ఉద్యోగులను ఖాళీ చేశారు.
- మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
- ఇప్పటికీ మంటలు దట్టంగా వ్యాపిస్తున్నాయి.. అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు