రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ళ టీనేజర్ మృతి
- January 23, 2019
ఫుజారియాలో మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఓ టీనేజర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 14 ఏళ్ళ టీనేజర్, అదే వయసున్న మరో స్నేహితుడు కలిసి మిర్బా సెటిల్‌మెంట్ ఇంటర్నల్ రోడ్డుపై వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ ఎస్‌యూవీ, బైక్‌ని ఢీకొనడంతో బైక్ మీద వెళుతున్న 14 ఏళ్ళ ఎమిరేటీ బాలుడు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో ఇద్దరు యువకులకూ తీవ్ర గాయాలు కాగా, వారిలో ఒకరు వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరో యువకుడికి ప్రస్తుతం వైద్య చికిత్స అందుతోంది. అతని శరీరంలో పలు ఎముకలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్