హాక్‌ మిస్సైల్స్‌తో లైవ్‌ ఫైర్‌ ఎక్సర్‌సైజ్‌

- January 23, 2019 , by Maagulf
హాక్‌ మిస్సైల్స్‌తో లైవ్‌ ఫైర్‌ ఎక్సర్‌సైజ్‌

రాయల్‌ బహ్రెయిన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఆర్‌బిఎఎఫ్‌) - ఎయిర్‌ డిఫెన్స్‌ వింగ్‌ విజయవంతంగా లైవ్‌ ఫైర్‌ ఎక్సర్‌సైజ్‌ని హాక్‌ మిస్సైల్స్‌తో నిర్వహించింది. అబుదాబీలోని అల్‌ మకాట్రా షూటింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగాయి. ఆర్‌బిఎఎఫ్‌ కమాండర్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ షేక్‌ హమాద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా, యూఏఈ ఎయిర్‌ ఫోర్స్‌ మరియు ఎయిర్స్‌ డిఫెన్స్‌ కమాండర్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఇబ్రహీమ్‌ నాజర్‌ అల్‌ అలావి ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నారు. రెండు దేశాలకు చెందిన ఎయిర్‌ ఫోర్సెస్‌ మధ్య జాయింట్‌ మిలిటరీ కో-ఆపరేషన్‌లో భాగంగా ఈ ఎక్సర్‌సైజ్‌ జరిగింది. హై యాక్యురసీతో టార్గెట్స్‌ని ఛేదించే శక్తిని ఎయిర్‌ డిఫెన్స్‌ వింగ్స్‌ చాటాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com