'జిప్సి' సింగిల్ ట్రాక్ విడుదల
- January 24, 2019
జీవా హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'జిప్సి'. ఈ సినిమాలోని 'వెరీ వెరీ బ్యాడ్..' అనే సింగిల్‌ట్రాక్ విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఎస్ అంబేద్కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కే సెల్వకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యుగభారతి, దర్శకుడు రాజుమురుగన్, హీరోగా జీవా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జీవా మాట్లాడుతూ.. ''ఓ గ్రామీణ గాయకుడు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథ. ఆ పర్యటన తర్వాత గొప్ప గాయకుడిగా మారుతాడు. అతను అలా గొప్ప వ్యక్తిగా మారడం వెనుక ఓ ప్రధాన కారణం ఉంది. అదే ప్రేమ!
ఈ కథ చెప్పేటప్పుడే తప్పకుండా నటించాలనిపించింది. ఈ సినిమా కోసం నిజంగానే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు పర్యటించా. అప్పుడే మన భారతదేశం ఎంత అందమైనదో అర్థమైంది. సినిమాలో పూర్తిగా నాతోపాటు ఓ గుర్రం ఉంటుంది.
చిత్రం కోసం భిన్నమైన గెటప్‌లో నటించా. ప్రేక్షకులకు అది నచ్చుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా విడుదలైన తర్వాత జీవా ఓ లక్కీ హీరో అనే గుర్తింపు వస్తుంది. నా జీవితంలో హిట్ చిత్రంగా మాత్రమే కాకుండా నా సినీ కెరీర్‌కే ఓ మైలురాయిగా ఇది ఉంటుందని నమ్ముతున్నట్లు'' పేర్కొన్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







