బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్
- January 24, 2019
వచ్చే ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పియూష్‌గోయల్ ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితం పియూష్ గోయల్‌కు ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ శాఖలను తాత్కాలికంగా అప్పగించారు. ప్రధాని మోడీ సూచన మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి విధుల్లో చేరే వరకు ఎలాంటి శాఖలు లేని మంత్రిగా అరుణ్ జైట్లీ కేబినెట్‌లో కొనసాగుతారు. కేన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఫిబ్రవరి 1న పియూష్ గోయాల్ ఇంటరిమ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గత ఏడాది కూడా పూర్తి బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. అపుడు కూడా అరుణ్ జైట్లీ కిడ్నీ చికిత్స కోసం సెలవులో ఉన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







