ముంబయి:స్నేహితుడిని చంపి..200 ముక్కలు చేసి టాయిలెట్లో పడేశాడు
- January 25, 2019
ముంబయి:స్నేహితుడిని చంపి అతని శరీరాన్ని 200 ముక్కలు చేసి వాటిని మరుగుదోడ్డిలో పడేసిన దారుణ హత్య సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. హత్య గురైన వ్యక్దిని గణేశ్ కొల్హాద్కర్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు పింటూ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాద్కర్ అనే వ్యక్తి గతంలో తన స్నేహితుడు శర్మ దగ్గర రూ. లక్ష అప్పు చేశాడు. కొద్దిరోజుల తర్వాత కొంత మెుత్తం చేల్లించాడు. మిగతా సోమ్ము కూడా చేల్లించాలని కొల్హాద్కర్పై శర్మ ఓత్తిడి తెచ్చాడు.
గత డిసెంబరు 16న కొల్హాద్కర్ ఇంటికి వేళ్ళిన శర్మ అతనితో గొడువకు దిగాడు. ఈ క్రమంలో మాట మాట పేరిగి కొల్హాద్కర్ను శర్మ గోడకేసి కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కొల్హాద్కర్ మృతదేహాన్ని అక్కడినుంచి తీసికేళ్ళి దాన్ని దాదాపు 200 ముక్కలుగా చేసి మరుగుదొడ్డిలో పడేసి నీళ్లు కొట్టేశాడు. ఈ కారణంగా అతను ఉండే భవనంలోని డ్రైనేజి వ్యవస్థ నిలిచిపోవడంతో స్థానికులు శుభ్రపరివాళ్ళను పిలిపించారు. వాళ్ళు డ్రైనేజి వ్యవస్థను క్లిన్ చేస్తున్న సమయంలో మనిషి శరీర బాగాలు బయటపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైయ్యారు వెంటనే పోలీసులకుసమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వారు ముక్కలుగా ఉన్న శరీర బాగాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు శర్మ చేసిన హత్య విషయం బయటపడింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..