ప్రముఖ దర్శకుడిపై దాడి. పేడనీళ్లు చల్లి..ముఖంపై గుద్ది..
- January 25, 2019
ప్రముఖ మలాయాళీ దర్శకుడు ప్రియానందనన్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడిచేసి, పేడ కలిపిన నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు.
బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
తన నివాసం నుంచి బయటికి వస్తుండగా పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని తెలిపారు. “బయటకు వెళుతున్న సమయంలో కోందరు దుండగులు
నన్ను వెంబడించి కొట్టి నామీద పేడ నీళ్లు పోసి పారిపోయారని” అని ప్రియానందనన్ మీడియాకు వివరించారు. గతంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఫేస్‌బుక్‌లో ఆయన అభ్యంతరకర పోస్టులు పేట్టారు. ఆ పోస్టులపై అప్పట్లో కొంత వివాధం చేలరేగింది. అది జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తనను మానసికంగా దెబ్బతీసేందుకే నాపై దాడులు జరుగుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు.. బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తలే ఈ దాడి చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆయన ఆరోపణలను కేరళ బీజేపీ ఖండించింది. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రియానందన్‌పై జరిగిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!