'మలాల్' గా వస్తున్న '7/జి బృందావన కాలని'
- January 25, 2019
ఒకటిన్నర దశాబ్దం క్రితం సంచలనం సృష్టించిన '7/జి బృందావన కాలని' గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ సినిమాని సంజయ్ లీలా భన్సాలీ హిందీలో రీమేక్ చేస్తున్నారట. దాదాపు పదిహేనేళ్ళ క్రితం విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసిందీ రొమాంటిక్ ఎంటర్టైనర్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా.. తమిళంలో '7/జి రెయిన్ బో కాలని' పేరుతో రిలీజై అక్కడా ఘనవిజయం సాధించింది. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
తెలుగు, తమిళ భాషల్లో అలరించిన '7/జి బృందావన కాలని' ఆ తరువాత బెంగాలీ, ఒడియా, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయి ఆదరణ పొందింది. కన్నడంలో 'గిల్లి' పేరుతో రూపొందిన ఈ సినిమా ద్వారానే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా తొలి అడుగులు వేసింది. అలాంటి '7/జి బృందావన కాలని'ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో పాటు టి-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నేషనల్ అవార్డు విన్నర్ మంగేశ్ హదవలే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాతో భన్సాలీ మేనకోడలు షర్మిన్ సెగల్ హీరోయిన్ గానూ, బాలీవుడ్ కమెడియన్ జావేద్ జాఫ్రీ తనయుడు మిజాన్ హీరోగా పరిచయం కానున్నారు. 'మలాల్' పేరుతో రూపొందుతున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి రానుంది. అయితే రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటికీ ఎక్కడా ఇది రీమేక్ చిత్రమని యూనిట్ ప్రచారం చేయకపోవడం విశేషం.
మరి హిందీలో కూడా '7జి' సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!