జాన్వీపై ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్
- January 25, 2019
సోషల్ మీడియా స్పీడందుకున్నతర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా ఇట్టే తెలిసిపోతుంది. క్రియేటివిటీ పేరుతో తామేదో కొత్తది కనిపెట్టామనుకున్నవాళ్లకి.. అలాంటిదే మరొకటి చూపించి క్షణాల్లో షాకిస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఓ స్టార్ డాటర్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
కథానాయికగా ఒక్క సినిమా వయసే అయినా.. ఫ్యాషన్ ట్రెండ్స్‌లో మాత్రం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్స్‌తో వెరైటీ డ్రెస్సులలో, క్లోవేజ్ షోతో కాకపుట్టించే జాన్వీ.. లేటెస్ట్గా ఓ ఫోటో షూట్లో పాల్గొంది. కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే పర్పుల్ కలర్ డ్రస్‌లో తళతళలాడింది ఈ స్టార్ డాటర్. ఈ కలర్ ఫుల్ డ్రెస్సుతో పాటు.. ఈ ఫోటో షూట్లో జాన్వీ స్టైల్ కూడా అదరహో అనిపించింది.
అయితే.. జాన్వీ ఫోటో షూట్లో వేసుకున్న హోలోగ్రాఫిక్ డ్రెస్.. కాపీ అని కొందరు ఫ్యాషన్ ప్రియులు చిటికెలో కనిపెట్టి జాన్విని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఇంటర్నేషనల్‌గా పాపులర్ అయిన బాల్మెయిన్ ఫాల్ 2018 కలెక్షన్లో.. ఓ మోడల్ వేసుకున్న హోలోగ్రాఫిక్ ఎఫెక్ట్ డ్రెస్‌ను జాన్వీ మక్కీకి మక్కీ దింపేసిందని ఆధారాలతో సహా నెటిజన్లు ట్రోల్ చేశారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!