వచ్చే ఎన్నికల్లో పోటీ: అద్వానీ, జోషిలదే నిర్ణయం
- January 25, 2019
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల్లో సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి పోటీ చేస్తామంటే అడ్డుచెప్పమని.. వారి పోరాటాన్ని ఆహ్వానిస్తామని ప్రకటించింది.
గత ఎన్నికల్లో గాంధీనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేసి అద్వానీ గెలిచారు. అప్పుడు ప్రధాని మోడీ కోసం వారణాసి నియోజకవర్గాన్ని వదిలేసిన మురళీ మనోహర్ జోషి తర్వాత కాన్పూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. అయితే వీరిద్దరూ బీజేపీలో సీనియర్ లీడర్లు అయినా.. కొన్ని రోజుల నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.
వీరిద్దరి వయస్సు ఎక్కువ అవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్దం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఒక అధికార ప్రకటన చేసింది.
రాబోయే ఎన్నికల్లో 75 ఏండ్ల వయస్సు దాటిన నాయకులకు లోక్‌సభ టికెట్లు ఇస్తున్నామని.. కాకపోతే సీనియర్లను మంత్రులుగా చేయడానికి వయసు పరిగణలోనికి తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇప్పటికే పార్టీలోని సీనియర్ పార్లమెంటేరియన్లు సుష్మా స్వరాజ్, ఉమా భారతి ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. కాని పార్టీ వారి నిర్ణయాన్ని ఇంకా పూర్తిగా ఆమోదించలేదు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!