'సీత' టైటిల్ ఆవిష్కరించిన తేజ
- January 25, 2019ఎట్టకేలకు తేజ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. అంతా అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దర్శకుడు తేజ, ఈ సినిమా టైటిల్ లోగోను తన ఫేస్ బుక్ ఖాతాలో విడుదల చేశాడు. అంతేకాదు, రేపు సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టైటిల్ ఫిక్స్ అయితే ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని ఇన్నాళ్లు ఆగారు. ఎట్టకేలకు ఆ టైటిల్ ఫిక్స్ అవ్వడంతో రేపట్నుంచి అఫీషియల్ గా ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ పేరు సీత.
ఏకే ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది