'మణికర్ణిక – ది క్వీన్ అఫ్ ఝాన్సీ' రివ్యూ

- January 25, 2019 , by Maagulf
'మణికర్ణిక – ది క్వీన్ అఫ్ ఝాన్సీ' రివ్యూ

విడుదల తేదీ: జనవరి 25, 2019

నటీనటులు: కంగనా రనౌత్ , అంకిత లోఖండే , అతుల్ కులకర్ణి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి , కంగనా రనౌత్

నిర్మాత: కమల్ జైన్

సంగీతం: శంకర్ -ఎహసాన్ -లాయ్

సినిమాటోగ్రఫర్: జ్ఙానశేఖర్

ఎడిటర్: రామేశ్వర్ భగత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. భారీ బడ్జెట్ తో ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం హిందీ తో పాటు తెలుగులోనూ విడుదలైయింది. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
ఆంగ్లేయుల నుండి ఝాన్సీ రాజ్యాన్ని కాపాడడం కోసం భీతుర్ సామ్రాజ్య యువరాణి మణికర్ణిక (కంగనా రనౌత్) ను ఆ రాజాన్ని పాలిస్తున్న నవల్కర్ వంశస్థులు కోడలుగా చేసుకుంటారు. ఇక ఆతరువాత మణికర్ణికా , ఝాన్సీ లక్ష్మి భాయ్ గా ఎలా మారింది ? ఆమె కంపెనీ నుండి ఝాన్సీ ని కాపాడుకుందా లేదా ? ఆంగ్లేయులు మీద ఏ విధంగా పోరాటం చేసిందని తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
కంగనా రనౌత్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. సినిమా మొత్తాన్ని ఆమె భుజాలపై వేసుకొని నడిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. వీరనారి గా ఆమె చేసే సాహసాలు నచ్చుతాయి. ఇక ఆమె ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా బాగుంది అలాగే సపోర్టింగ్ రోల్స్ లో నటించిన అతుల్ కులకర్ణి , అంకిత లోఖండే , మిస్తీ చక్రవర్తి వారి పాత్రల్లో చాలా బాగా నటించారు.

ఇక ఈసినిమా మరో మేజర్ ప్లస్ పాయింట్ విజువల్స్. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాకి విజువల్సే ప్రాణం పోస్తాయి. ఈ విషయంలో ఈచిత్ర మేకర్స్ 100శాతం సక్సెస్ అయ్యారు. 1800 కాలం నాటి వాతావరణాన్ని తెర మీద అద్భుతంగా చూపించారు. తెర మీద సినిమా చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది.
 
ఇక అలాగే సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ తరువాత వచ్చే యుద్ధ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా అనిపించాయి.

మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే స్టోరీ లో డెప్త్ లేకపోవడమే. కథ కు తోడు కథనం కూడా మామూలుగానే అనిపిస్తుంది. సినిమా అంత ఊహాజనితంగా ఉండడంతో పూర్తిగా స్టాటిస్ఫై చేయలేకపోయింది. ఈ విషయంలో కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. ఇక నటిగా మెప్పించిన కంగాన డైరెక్టర్ గా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఒక వీర వనిత లైఫ్ స్టోరీ ని తెరమీద చూపించాలన్న ఆమె ప్రయత్నం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇలాంటి ఒక బయోపిక్ ను తెరమీదకు తీసుకువచ్చేటప్పుడు ఎమోషనల్ సన్నివేశాల్లో డెప్త్ ఉండేలా చేసుకోవాలి కానీ ఈ చిత్రంలో అది మిస్ అయ్యింది. ఇక ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం సాగదీతగా అనిపిస్తుంది ముఖ్యంగామెయిన్ స్టోరీ లోకి వెళ్లడానికి దర్శకులు చాలా సమయం తీసుకున్నారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా అసంపూర్ణంగానే అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:
ఇలాంటి ఒక సినిమాను సినిమా ను తెర మీదకు తీసుకువచ్చే సాహసం చేసిన దర్శకులు క్రిష్ అలాగే కంగనా ను అభినందించాల్సిందే. అయితే ఈ ప్రయత్నంలో వారు పూర్తి స్థాయిలో విజయం సాదించలేకపోయిన చాలా వరకు మెప్పించారు. ఇక సినిమాటోగ్రఫీ చిత్ర విజయంలో కీలక పాత్రా ను పోషించింది. జ్ఙానశేఖర్ అందించిన ఛాయాగ్రహణం చాలా బాగుండి సినిమాకు గ్రాండియర్ లుక్ ను తీసుకొచ్చింది.

శంకర్ ఎహసాన్ లాయ్ అందించిన సంగీతం ప్రత్యేకంగా లేకున్నా నేపథ్య సంగీతం తో ఆకట్టుకున్నారు. ఎడిటింగ్ కూడా బాగుంది. కమల్ జైన్ ఈచిత్రానికి భారీగానే ఖర్చు చేశారు. ఆ ఖర్చు తెర మీద కనిపిస్తుంది.

తీర్పు:
ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితం ఆధారంగా క్రిష్ , కంగనా రనౌత్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కంగనా నటన , విజువల్స్ హైలైట్ అవ్వగా నెమ్మదించిన కథనం ,ఊహాజనితమైన స్టోరీ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా పీరియాడికల్ మూవీస్ ను ఇష్ట పడే వారికీ అలాగే ఝాన్సీ లక్ష్మి బాయ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్లకి ఈ చిత్రం మంచి ఛాయస్ అవుతుందని చెప్పొచ్చు.

మాగల్ఫ్.కామ్ రేటింగ్:  3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com