'డిస్కో రాజా' గా రవితేజ

- January 26, 2019 , by Maagulf
'డిస్కో రాజా' గా రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ మరో కొత్త అవతారం ఎత్తాడు. సినిమాల్లో ఏ వేషం వేయాలన్న ఇతనికి రారెవ్వరు సాటి. క్లాస్, మాస్ ఏదైనా ఓకే అనేస్తుంటాడు ఈ హీరో. తాజాగా ఓ విలక్షణ క్యారెక్టర్ చేసేందుకు సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. 'డిస్కోరాజా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ లోగో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజతో అందాల భామ పాయల్ రాజ్ పుత్ డిస్కో డాన్స్ వేయనుంది! అదేనండీ హీరోయిన్ గా నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com